ఒక్కొక్కరుగా లొంగిపోయే బదులు, అందరూ కలిసి లొంగిపోతాం-ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్
ఆయుధ విరమణ చేస్తాం..
అమరావతి: తమకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఎదుట ఆయుధ విరమణ చేస్తామని,,ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ (MMC) ప్రత్యేక జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరుతో శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.జనవరి 1వ తేదీన సాయుధ కాల్పులను విరమిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒక్కొక్కరుగా లొంగిపోయే బదులు, అందరూ కలిసి లొంగిపోతామని ఈ లేఖలో పేర్కొన్నారు. పరస్పర సమన్వయం , కమ్యూనికేషన్ కోసం నక్సల్ ప్రతినిధి ఓపెన్ ఫ్రీక్వెన్సీ నంబర్‌ను కూడా విడుదల చేసినట్లు తెలిపారు.ఎన్కౌంటర్ జరిగింది. ఇటీవల జరుగుతున్న ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు పలువురు కీలక నేతలు మృతిచెందారు. ఈ క్రమంలోనే ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం

