హైదరాబాద్ డ్రైనేజ్ రాత మాత్రం మారదు.? ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
అమరావతి: ఎన్ని పార్టీలు మారిన హైదరాబాద్ డ్రైనేజ్ రాత మాత్రం మారదు.? వాతావరణశాఖ హెచ్చరించినట్లుగానే హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తొంది..షేక్ పేట్, ఖాజాగూడ, రాయదుర్గం, గచ్చిబౌలి,కొండాపూర్, హఫీజ్ పేట్, మాదాపూర్, మియాపూర్ లో భారీ వర్షం పడింది..రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాయదుర్గం, బయోడైవర్సిటీ, ఐకియా జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గచ్చిబౌలి పిజేఆర్ ఫ్లైఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏఎంబీ మాల్ ముందు వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. హఫీజ్ పేట్, ఆల్విన్ కాలనీ, చందానగర్ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ ఉంది.
