తుపాకులు గురిపెట్టి ఖజాన బంగారం దుకాణంలో దొపిడి
తెలంగాణ: హైదరాబాద్ నగరంలో దొపిడి దొంగలు బంగారం దుకాణంలో తుపాకులతో ప్రవేశించి నిమిషాల వ్యవధిలో అందికాడికి దొచుకుని అడ్డు వచ్చిన వారిపై కాల్పులు జరిపి పరారీ అయ్యారు.. మంగళవారం ఉదయం చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్ షాపు తెరచిన 5 నిమిషాల్లో కొంతమంది దుండగులు తుపాకులతో ఒక్కసారిగా దుకాణంలోకి ప్రవేశించి బెదిరింపులకు దిగారు..జ్యువలరీ షాపులోకి ప్రవేశించిన దుండగులు లాకర్ తాళాలు ఇవ్వాలని షాపులోని సిబ్బందిని గన్‌తో బెదిరించారు.. లాకర్ తాళం ఇవ్వకపోవడంతో అసిస్టెంట్ మేనేజర్ కాళ్లపై కాల్పులు జరిపారు.. లోపలకు వెళ్లి బంగారు ఆభరణాలకు సంబంధించిన గ్లాస్ స్టాల్స్ ను పగలగొట్టి,,దొరికిన బంగారంతో పరిపోయారు..షాపులోని సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.. దొపిడి చేసిన దుండగులు జహీరాబాద్ వైపు పారిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది..దొంగల ముఠాలో మొత్తం 6 మంది ఉన్నట్లు దుకాణం సిబ్బంది తెలిపారు..సంఘటన స్థలంకు చేరుకున్న సిటీ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి,దొంగలను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు..ఇటీవల కూకట్‌పల్లిలో వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ పాల్పడిన నిందితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.. దుకాణంలో భారీగా బంగారం చోరీ అయినట్లు తెలుస్తోంది.