AP&TG

విలీనం తరువాత మెడికల్ గా అన్ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

అమరావతి: మెడికల్ గా అన్​ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం తరువాత మెడికల్ అన్​ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రత్యామ్నాయ ఉద్యోగాలివ్వాలని నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2020 జనవరి 1వ తేది తరువాత మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వనున్నారు.విలీనానికి ముందు మెడికల్ అన్ ఫిట్ అయిన డ్రైవర్లకు మాత్రమే ప్రత్యామ్నాయ ఉద్యోగాలిచ్చే విధానం ఉండదే. ఇకపై ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లతో సహా మిగిలిన ఉద్యోగులందరికీ ప్రత్నామ్నాయ ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విలీనం తరువాత కూడా:- కార్పోరేషన్​లో ఉండగా 21 కేటగిరీల్లో మెడికల్ అన్​ఫిట్ అయిన వారికి మరో ఉద్యోగం ఇచ్చేవారు. విలీనం తరువాత కూడా 21 కేటగిరీల్లో మెడికల్ అన్ ఫిట్ అయిన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్ అన్ ఫిట్ అయిన వారికి కండక్టర్, రికార్డు ట్రేసర్, అసిస్టెంట్ మెకానిక్ /శ్రామిక్ ఉద్యోగాలివ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో ఇచ్చే ఉద్యోగానికి అర్హత లేకపోతే ప్రభుత్వ విభాగాల్లో అర్హత బట్టి ఉద్యోగాలివ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కలెక్టర్ల ద్వారా ప్రభుత్వ విభాగాల్లో అర్హత మేరకు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏ ఉద్యోగానికీ అర్హత లేని వారికి అదనపు మానిటరీ ప్రయోజనాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.

జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు:- మెడికల్ అన్ ఫిట్ వల్ల వాలంటరీ రిటైర్డ్ అవ్వాలనుకునే వారికి అదనపు మానిటరీ ప్రయోజనాలు చేకూరేలా తదుపరి చర్యలు తీసుకోవాలని ఎపీపీటీడీ కమిషనర్‌కు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. అలాగే తదుపరి చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి .కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *