మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్టోక్
అమరావతి: వైసీపీ నేత, మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనకు బ్రెయిన్ స్టోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.వైద్యులు బొత్సకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గురువారం రాత్రి ఇబ్బందిగా అనిపించడంతో ఆయన సొంత వాహనంలో హైదరాబాద్ వెళ్లారు. శుక్రవారం ఉదయం సిటీ న్యూరో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అక్కడి వైద్యులు బొత్సకు చికిత్స అందించి పలు టెస్టులు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని వైద్యులు చెప్పారని వైసీపీ ఎమ్మెల్సీలు తెలిపారు.

