ప్రకాశంజిల్లా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం-ఆరుగురు మృతి
అమరావతి: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం, తాటిచెర్లమోటు వద్ద లారీ, కారు ఢీ కొన్న ఘటనలో స్టూవర్టుపురంనకు చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు..శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భవానీ, నరసింహన్, బబ్లూ, దివాకర్, సన్నీ, అంకాలు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..కారులోని వారంతా మహానంది వద్దనున్న మహాబలిపురం వెళ్లి,,బాపట్ల తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని,,ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు..ప్రమాద సమయంలోకారు రాంగ్ రూట్ లో వేగంగా వెళ్లడం కారణంగా లారీని ఢీ కొన్నట్లు తెలుస్తొంది..దిని వల్లే ప్రమాద తీవ్రత బాగా పెరిగిందని పోలీసులు వెల్లడించారు..ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారంతా మరణించారని,,కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్నారు..ఈ ప్రమాద ఘటనకు సంబంధించి, సమీపంలోని పెట్రోల్ బంక్‌లోని సీసీ కెమెరాలో రికార్డు అయిందని పోలీసులు తెలిపారు.

