AP&TGDEVOTIONALOTHERS

తిరుమల పవిత్రతను కాపడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది-పవన్ కళ్యాణ్

అమరావతి: తిరుమల లడ్డూ వ్యవహారంలో కల్తీ జరుగలేదని బుకాయిస్తున్న వైసీపీ నాయకులు దేవుడితో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూటమి నాయకులు తీవ్ర హెచ్చరించారు.సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాదవ్‌ బుధవారం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. తిరుమల పవిత్రతను కాపడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. లడ్డూ విషయంలో సీబీఐ పంపిన నివేదిక ఆధారంగా ఏక సభ్య కమిషన్‌ను వేసి అవసరమైతే కోర్టులో కూడా అదనపు సమాచారాన్ని అందచేస్తామని తెలిపారు. తప్పు చేసి దాని కప్పిపుచ్చేందుకు తమపై దుష్ప్రచారం చేస్తు, ప్రజల దృష్టిని మరల్చేందుకు చూస్తున్నారని అన్నారు.

భగవంతుడిపై పగపెచుకున్నవాడు:- నేను ఒకటే చెపుతున్నాను,భగవంతుడిపై పగపెచుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప బ్రతికిన దాఖలు లేవని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. ఈ విషయంలో దోషులను అన్ని విధాలుగా శిక్షిస్తామని అన్నారు. వైసీపీ నాయకులకు దేవుడంటే లెక్కలేనితనమని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చరిత్రలో వెంకన్నస్వామి జోలికి ఎవరూ రాలేదని వస్తే ఏడుకొండలవాడే ప్రజలను అప్రమత్తం చేస్తారని అన్నారు.

లడ్డూ తయారీలో మహాపాపం చేసి ఎదురుదాడి చేస్తుంటే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి అన్యమతస్థులు డిక్లరేషన్‌పై సంతకం పెట్టిన తరువాతనే దర్శనానికి అనుమతి ఉంటుందని, వైఎస్‌ జగన్‌ డిక్లరేషన్‌పై సంతకం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అబ్దుల్‌ కలాం సంతకం పెట్టి దర్శనం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *