అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆతదుపరి 48 గంటల్లో దక్షిణమధ్య బంగాళాఖాతం,పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.