చిరంజీవికి పబ్లిసిటీ,పర్సనాలిటీ హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు అదేశాలు
హైదరాబాద్: అర్డిఫిషియల్ ఇంటెల్ జెన్స్ (AI) రంగ ప్రవేశంతో సమాజంలో సెలబ్రిటీలు అలాగే ప్రముఖల పేర్లు,ఫోటోలు,గాత్రం, పాటలు,వీడియోలను దుర్వినియోగం చేయడం నేడు సర్వసాధరణం అయిపోయింది.ఈ నేపథ్యంలో పలువురు అగ్రనటులు న్యాయస్థానాలు ఆశ్రయిస్తున్నారు. వారిలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, నాగార్జున,ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, కరణ్ జోహార్, ఆశాభోంస్లే తదితరులు ఉన్నారు.
పేరు, ఫొటోలు, వాయిస్:- తెలుగు సినిమా పరిశ్రమలో మెగా స్టార్ అయిన హీరో కొణిదెల చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు మధ్యంతర ఉత్తర్వులను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు శనివారం మంజూరు చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం వ్యక్తి లేదా సంస్థ అయినా చిరంజీవి వ్యక్తిత్వం,, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్ తదితర గుర్తించిన వాటిని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని న్యాయస్థానం నిషేధించింది.
ప్రచారం ఆపివేయండి:- తన పేరు లేదా చిత్రం లేదా ప్రసిద్ధ సినీ శీర్షికలను అనుమతి లేకుండా వాడుకోవడం, ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ మొదలైన వేదికలపై వినియోగించడం, అలాగే కృత్రిమ మేథస్సు (AI) మార్ఫ్ చేసిన చిత్రాలు, వీడియోలను ప్రచారం చేయడాన్ని ఆపివేయాలని చిరంజీవి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
30 మందికి కోర్టు నోటీసులు:- ఈ కోర్టు జారీ చేసిన నిషేధాజ్ఞ ప్రకారం చిరంజీవి పేరు, స్టేజ్ టైటిల్స్ (MEGA STAR, CHIRU, ANNAYYA), స్వరం, చిత్రం లేదా ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఇతర వ్యక్తిత్వ లక్షణాలను ఏ రూపంలోనైనా, ఏ మాధ్యమంలోనైనా, వ్యక్తిగత లేదా వాణిజ్య లాభం కోసం నేరుగా గానీ పరోక్షంగా గానీ ఉపయోగించవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే చిరంజీవి పేరును, ఫొటోలను దుర్వినియోగం చేసిన 30 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 27 అక్టోబర్ న్యాయస్థానం వాయిదా వేసింది.

