స్మార్ట్ స్ట్రీట్ ను వర్చువల్ ద్వారా ప్రారంభించిన సీఎం చంద్రబాబు
నెల్లూరు: అమరావతి: ప్రతీ కుటుంబానికి మెరుగైన ఆదాయం-జీవనోపాధి కల్పించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.శనివారం నెల్లూరు లోని మైపాడు గేట్ వద్ద స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ను సీఎం అమరావతి నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. 30 మాడ్యులర్ కంటైనర్లతో 120 దుకాణాలను ఏర్పాటు చేసి వీధి వ్యాపారులకు స్థిర వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించింది. వీటిని వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా లబ్దిదారులైన దుకాణదారులతో మాట్లాడారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ లో దుకాణాలు పొందిన 120 మంది ఇప్పుడు ఎంట్రప్రెన్యూర్ లు అయ్యారు. ఈ వినూత్న ప్రయత్నం చేసిన మంత్రి నారాయణ, పురపాలక శాఖ, మెప్మా వారిని అభినందిస్తున్నాను. ఈ తరహా వినూత్న ఆలోచనలు, ప్రయత్నాలు మరిన్ని జరగాలి. అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ,మెప్మా ఎండీ తేజ్ భరత్ ,కమీషనర్ నందన్,తదితరులు పాల్గొన్నారు.