అమరావతిలో జుడీషియల్ అకాడమీకి శంఖుస్థాపన చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
అమరావతి: అమరావతి సమీపంలోని పిచ్చుకల పాలెం వద్ద జుడీషియల్ అకాడమీ నిర్మాణానికి ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ శంఖుస్థాపన చేశారు. జుడీషీయల్ అకాడమీని 165 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తుండగా దీనిలో బ్లాక్ బిలో జి ప్లస్ 3 అంతస్తులతో అకాడమిక్ బ్లాక్ నిర్మిస్తున్నారు. అదే విధంగా జి ప్లస్ 8 అంతస్తులతో హాస్టల్ బ్లాక్,జి ప్లస్ 3 అంతస్తుల్లో ఇండోర్ స్పోర్ట్స్-గెస్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు.120 మంది బ్యాచ్ ఆఫ్ ట్రైనీ జడ్జిలకు సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. మొత్తం భవన విస్తీర్ణం 2.05 లక్షల చదరపు అడుగులు.ఎపి హైకోర్టు నుంచి ఈ జుడీషియల్ అకాడమి 5.7 కి.మీల దూరంలో 50 మీటర్ల వెడల్పుతో రహదారి సౌకర్యం ఉంది.
బ్లాక్ ఎ జి ప్లస్ 3 అంతస్తులతో కూడిన అడ్మినిస్ట్రేటివ్-అకాడమిక్ బ్లాక్ 500 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియంతో కూడిన స్టేజ్-ఫ్రీ ఫంక్షన్ ఏరియ,120 సీట్లతో కూడిన సెమినార్ హాల్,70 సీట్లతో కూడిన 2 క్లాస్ రూమ్ లు,70 సీట్లతో మూట్ కోర్ఠు హాల్,60 సీట్లతో ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంటుంది.అలాగే 50 సీట్లతో కంప్యూటర్ ల్యాబ్,48 సీట్లతో లైబ్రరీ- రీడింగ్ రూమ్, డైరెక్టర్-అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, జడ్జిల లాంజ్,ఫ్యాకల్టి రూమ్-కొలాబరేషన్ స్పేస్స్,హెల్తు యూనిట్-క్రెచే సౌకర్యం,3 మీటర్ల వెడల్పు కలిగిన కారిడార్స్, సెంట్రల్ లిఫ్టు వంటి ఆధునిక సౌకర్యాలు కలిగి ఉంటుంది.ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,సుప్రీంకోర్టు న్యాయమూర్తులు,తదితర అధికారులు పాల్గొన్నారు.

