మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుంది,మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే-మాజీ సీఎం జగన్
అమరావతి: ఇంకో మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
కలెక్షన్ ఏజెంట్లలా పోలీసులు:- మా హయాంలో పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబరిచారని,, చంద్రబాబు చెప్పినట్టు వినకపోతే డీజీ స్థాయి అధికారులపై కూడా తప్పుడు కేసులు పెట్టి, అరెస్టులు చేస్తున్న పరిస్థితి నేడు కనిపిస్తోందని, మాఫియా డాన్ లలా, కలెక్షన్ ఏజెంట్లలా పోలీసులు తయారయ్యారని మండిపడ్డారు.ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. సూపర్ సిక్స్ సహా 143 హామీలిచ్చి ప్రజలను బాబు మోసం చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని వైసీపీ అధినేత వ్యాఖ్యనించారు.బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రెస్మిట్ నిర్వహించారు.
రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా:- ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటే ప్రతిపక్ష పార్టీ అని మిగిలిన ప్రధాన పార్టీలు టీడీపీతో అధికారాన్ని పంచుకుంటున్నాయని,,దింతో రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా పలుకుతున్న ఏకైక పార్టీ వైసీపీ అని అన్నారు.. సూపర్ సిక్స్ హామీలు వదిలేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తు,, ప్రజలకు సంఘీభావంగా గొంతు కలపటం, అండగా నిలబడటం చేస్తుందని వెల్లడించారు. గత ఏడాది కాలంగా ప్రజలను అధికారపార్టీ అన్నీ రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నరని ఆరోపించారు.
మూడేళ్లు ఆగితే తిరిగి వైసీపీ ప్రభుత్వం:- బాబు ష్యూరిటీ అంటూ ప్రజలకు కూటమి పార్టీలు ఇచ్చిన బాండ్లపై వారి మోసాలు ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నమని,,, రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రజలను చైతన్య వంతులను చేసేలా కార్యక్రమాలు చేపడమన్నారు. రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా చంద్రబాబు దగ్గరకు వెళ్ళటం లేదు, వైసీపీ తలుపు తడుతున్నారు. ఇది చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ప్రజల గొంతును నొక్కివేసే ప్రయత్నం చేస్తున్నారు. మరో మూడేళ్లు ఆగితే తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తుంది, మన సమస్యలు తీరతాయని ప్రజలు ఆలోచిస్తున్నారు’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.