AP&TGCRIME

నెల్లూరులో వైసీపీ నేతలపై కేసులు నమోదు

నెల్లూరు: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి‌ కార్యాలయంపై దాడికి యత్నం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, శాంతి భధ్రతలకు విఘాతం కల్పించారంటూ నెల్లూరుజిల్లా వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులుగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆయన కుమార్తె పూజితారెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైసీపీ నేత వెంకటశేషయ్య, వైసీపీ నాయకులు ఉన్నారు.ABN ఆంధ్రజ్యోతి MD రాధాకృష్ణను మాజీ మంత్రి కాకాణి తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. దమ్ము, ధైర్యం ఉంటే, మగాళ్లు అయితే బారికేడ్లు దాటి రావాలంటూ కాకాణి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసులను దుర్భాషలాడుతూ, నెట్టేస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతల తీరుపై ఆంధ్రజ్యోతి‌ నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ కె.హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు  5వ పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు. BNS Sections 189(2), 126(2), 79, 351(2) R/W 190 కింద కేసులు నమోదయ్యాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *