మంత్రి నారాయణతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్
అమరావతి: డిజైన్లు,ఇంజనీరింగ్ సేవల్లో కలిసి పనిచేసేందుకు UK ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పోర్ట్ గ్రూప్ ఆసక్తి చూపిస్తూందని,, అమరావతి అభివృద్ధికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని బ్రిటిష్ డెప్యూటీ హై కమిషనర్ ఓవెన్ తెలిపారు..బుధవారం మంత్రి నారాయణతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ఇటీవల అమరావతిలో ప్రధాని మోడీ కార్యక్రమం బాగా జరిగిందని ప్రశంసించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్,,సీఎం చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించారు.
అమరావతి నిర్మాణం-ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యూకే ప్రతినిధులకు మంత్రి నారాయణ వివరించారు..అమరావతిలో ఐకానిక్ భవనాల డిజైన్లు యూకేకు చెందిన నార్మన్ ఫాస్టర్ రూపొందించారని మంత్రి తెలిపారు. సమావేశంలో పాల్గొన్న యూకే గ్రూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పోర్ట్ చైర్ పర్సన్ పర్వీస్,, ఏ.పి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ లు పాల్గొన్నారు.