లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు
అమరావతి: రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేస్తూ శనివారం కోర్టు తీర్పునిచ్చింది..లిక్కర్ కేసులో సిట్ అధికారులు బాలాజీ గోవిందప్పను మే 13న, ధనుంజయ్, కృష్ణమోహన్ రెడ్డిని మే16న అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో తన పేరు బయటికి వచ్చిందని తెలియగానే భారతి సిమెంట్స్ డైరెక్టర్ అయిన బాలాజీ గోవిందప్ప పలు రిసార్టులు మారుస్తూ,, ఆచూకీ దొరకకుండా తప్పించుకుని తిరిగిన ఆయన్ను కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లో చామరాజనగర జిల్లా ఎరకనగడ్డె కాలనీలోని ఓ వెల్ నెస్ సెంటర్ బయట అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు రిమాండ్ విధించింది. పలుమార్లు బెయిల్ కోసం అప్లై చేయగా,, రిజెక్ట్ చేస్తూ వచ్చిన కోర్టు,,శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి ఏ31గా, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఏ32గా, బాలాజీ గోవిందప్ప ఏ33గా ఉన్నారు. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కూడా ఏసీబీ కోర్టు శనివారం ఉదయం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్న తరువాత ఈ నెల 11న తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కావాలని ఆదేశించింది. అలాగే రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులతో షూరిటీని కోర్టుకు సమర్పించాలని తెలిపింది.