సెప్టంబరు 18వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
అమరావతి: సెప్టంబరు 18వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు.. అసెంబ్లీ సమావేశాలు18వ తేదీ ఉదయం 9 గంటలకు, కౌన్సిల్ సమావేశాలు ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. మొదటి రోజు సమావేశం అనంతరం రెండు సభల బిఎసి సమావేశాలు జరుగుతాయి. ఆ రోజు సమావేశాల ఏజెండా, ఎన్ని రోజులు సభలు జరగాలి అనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు.