AP&TG

మార్చి 9 నుంచి ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ

నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగంలో..

అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం అవుతుందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీపై కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు మంచి అవకాశం అన్నారు. ఎంతో మంది ఉద్యోగాలకు వస్తున్నారని అటువంటి యువత ఉద్యోగం అవకాశం లభించిందన్నారు.

హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ డైరెక్టర్ వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ మాట్లాడుతూ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తుందన్నారు. మార్చి 9, 10 తేదీలలో బాలికలకు., మార్చి 12,13 తేదీలలో ఆంధ్ర ప్రదేశ్ పురుషు అభ్యర్థులకు, మార్చి 15,16 తేదీలలో తెలంగాణ పురుషు అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుందన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంపిక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.2005 జూలై 2 నుండి 2009 జనవరి 2వ తేదీ మధ్య జన్మించిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు అర్హులన్నారు.

అభ్యర్థులు ఎలాంటి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, నేరుగా ర్యాలీకీ హాజరు కావచ్చని తెలిపారు. ఒరిజినల్ లేదా డిజీలాకర్ ద్వారా ధృవపరిచిన విద్యార్హత సర్టిఫికేట్లు (X మరియు XII పాసైన సర్టిఫికేట్లు లేదా తత్సమాన విద్యార్హత సర్టిఫికేట్లు), నివాస ధృవీకరణ (డొమిసైల్ సర్టిఫికేట్),

NCC సర్టిఫికెట్ (ఒక వేళ ఉంటే):- ఆధార్ కార్డ్, ఈ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఇటీవలి తీసుకున్న 10 కాపీలు పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటోలు,  ప్రతి సర్టిఫికెట్ కు సంబంధించిన 6 జిరాక్స్ కాపీలు తీసుకురావాలని వివరించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహిళ అభ్యర్థులు మార్చి 9వ తేదీన, ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులు మార్చి 12వ తేదీన, తెలంగాణ పురుష అభ్యర్థులు మార్చి 15వ తేదీ ఉదయం 6 గంటల నుండి10 గంటలు వరకు నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో హాజరు కావాలని కోరారు.

అర్హతలు:- కనీస ఎత్తు 152 సెం.మీ. (స్త్రీ-పురుషులు), ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత లేదా 3 సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ లేదా 2 సంవత్సరాల ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణత కలిగిన విద్యార్హత ఉండాలన్నారు. మొత్తం మార్కుల్లో 50 శాతం-ఇంగ్లీషులో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.

1.6 కిలో మీటర్ల పరుగు పోటీ, భౌతిక, శారీరక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుందని చెప్పారు. రాత పరీక్షకు ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుందని, ఒక తప్పు జవాబుకు పావు మార్కు తీసివేయడం జరుగుతుందని చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *