అధిక ధరలకు మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎం.ఆర్.పి కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికలో స్పందించారు.కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయని ప్రస్తావించారు.అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని అలాగే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తోందని పేర్కొన్నారు. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు. సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని మార్గనిర్దేశం చేశారు. అధిక ధరలకు విక్రయించే మద్యం వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు.

