AP&TG

మోహన్ బాబు యూనివర్సిటీ దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలి-పేరెంట్స్ అసోసియేషన్

అమరావతి: మోహన్ బాబు యూనివర్సిటీ  దౌర్జన్యాలు చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తూట్లు పొడుస్తూ, తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం విద్య పేరుతో జరుగుతున్న అవకతవకలు అరాచకాలను అడ్డు లేకుండా పోయిందని పేర్కొన్నారు.అక్రమాలను ప్రశ్నిస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు సిద్ధమైన విద్యార్థి సంఘాలు నాయకులను కిడ్నాప్ చేయడం, భౌతిక దాడులు చేయడానికి పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.

తల్లిదండ్రులపై వేధింపులు:- గతంలో అక్రమ ఫీజుల వసూళ్ల పై ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులపై యూనివర్సిటీ యాజమాన్యం కక్షగట్టి తప్పుడు కేసులు బనాయించడం అన్యాయం అని తెలిపారు.నేడు యూనివర్సిటీ యాజమాన్యంను ప్రశ్నిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులపైకి గూండాలను పంపి దౌర్జన్యాలకు దిగడం, కిడ్నాప్‌లు చేయడం చూస్తుంటే అక్కడ విద్యా సంస్థ నడుస్తోందా లేక గూండా రాజ్యం నడుస్తోందా అన్న అనుమానం కలుగుతోందన్నారు.

చట్టాల ఉల్లంఘన: APHERMC విచారణలో తేలిన రూ.26.17 కోట్ల అక్రమ వసూళ్లను తిరిగి విద్యార్థుల చెల్లించకుండా, ప్రభుత్వం విధించిన రూ.15 లక్షల జరిమానాను ఖాతరు చేయకుండా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ,విద్యాశాఖ మంత్రి వెంటనే ఈ విషయపై జోక్యం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని, అక్రమాలకు పాల్పడుతున్న యూనివర్సిటీ అనుమతులు రద్దు చేయాలి.డిమాండ్ చేశారు. విద్యార్థులు-తల్లిదండ్రులు చేస్తున్న ఈ పోరాటానికి ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( PAAP)పూర్తి సంఘీభావం తెలుపుతోందని మలి రెడ్డి కోటారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు నరహరి.శిఖరం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ.ఈశ్వరయ్య తదితరులు డిమాండ్ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *