ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
అమరావతి: అక్టోబర్ 24న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని, అక్టోబర్ 26న ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శనివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం,మన్యం,విశాఖ,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,కృష్ణా, ప్రకాశం,అనంతపురం,శ్రీసత్యసాయి, కడప,అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

