ఈ నెల 22న మధురైలో మురుగన్ భక్తుల మహాసమ్మేళనం
అతిథులుగా యోగీ ఆదిత్యా నాథ్,పవన్ కల్యాణ్ లు..
అమరావతి: హిందూ మున్నని సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా మధురైలో ఈ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు”మురుగన్ భక్తుల మహా సమ్మేళనాన్ని” అమ్మ తిడల్, పాండి కొవిల్ సమీపంలో ఏర్పాటు చేశామని హిందూ మున్నని అధ్యక్షులు సుబ్రహ్మణ్య, ఎలంగోవన్ తెలిపారు..ఈకార్యక్రమానికి 3 లక్షలమందికి పైగా భక్తులు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ నుండి హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సేవ్ టెంపుల్స్ భారత్ జాతీయ అధ్యక్షులు, ముమ్మరులు గిన్నీస్ ప్రపంచ రికార్డుల గాయకులు డా.గజల్ శ్రీనివాస్ లు ఆత్మీయ అతిథులుగా పాల్గొననున్నారని తెలిపారు.సనాతన ధర్మ హిందూ బంధువులు పెద్ద యెత్తున పాల్గొనాలని నిర్వాహకులు పిలుపు నిచ్చారు.. వివిధ రాష్ట్రాల నుండి కళాకారులు ప్రత్యేక సాంస్కృతిక, భక్తి కార్యక్రమాలు వుంటాయని నిర్వాహకులు తెలిపారు.

