AP&TGDEVOTIONALOTHERS

దశాబ్ద కాలం అనంతరం ఒక్క రోజే శ్రీవారిని దర్శించుకున్న95,080 మంది భక్తులు-టీటీడీ

మే 31న అత్యధిక భక్తులకు దర్శనం..

తిరుమల: దాదాపు దశాబ్ద కాలం అనంతరం, తిరుమల శ్రీవారిని అత్యధిక స్థాయిలో మే 31న 95,080 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది.. మే నెలలో అన్న ప్రసాదాల వితరణ కోటి మార్క్‌ ను దాటిందని వెల్లడించారు.. మే 16 నుంచి తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టీటీడీ ఉద్యోగులు అవిశ్రాంతంగా అహర్నిశలు విధులు నిర్వహించి, గత రెండు వారాల్లోని గురు,,శుక్రవారాల్లో కూడా అత్యధిక మంది భక్తులకు దర్శనం కల్పించడం జరిగిందని తెలిపారు..

వివిధ విభాగాల అధికారుల పర్యవేక్షణలో శ్రీవారి ఆలయ సిబ్బంది, విజిలెన్స్ విభాగం సహకారంతో అన్నప్రసాదం, తాగునీరు, పాల వితరణ భక్తులకు సమర్థవంతంగా అందించడం జరిగిందన్నారు..దీంతో అనేకమంది భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకోగలిగారని వెల్లడించారు..గతేడాది మే నెలతో పోల్చితే, ఈసారి 55,759 మంది అధికంగా దర్శనం పొందారన్నారు..2024 మేలో 23,23,493 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 2025 మేలో 23,79,252 మంది భక్తులు దర్శించుకున్నారని పేర్కొన్నారు..అలాగే, అన్నప్రసాద వితరణలో కూడా ఈ ఏడాది నూతన రికార్డు నమోదైందని తెలిపారు.. 2024 మేలో 71 లక్షల వితరణలు జరిగితే,,ఈ సంవత్సరం 2025 మేలో 1.33 కోట్ల వితరణలు నమోదు కావడం విశేషం అని తెలిపారు..  మే నెలలో తలనీలాల సంఖ్య, లడ్డూ విక్రయాల పరంగా కూడా గత ఏడాది మేతో పోల్చితే అధికంగా నమోదు అయిందని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *