AP&TGCRIME

వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు-మరో కేసు

మరో కేసులో పీటి వారెంట్…

అమరావతి: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు, ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఇదే సమయంలో అంబటిపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌నూ న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటికి బెయిల్‌ మంజూరు కావడంతో గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందా?. మళ్లీ జైలు గూటికి చేరుతారా?.

సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అంబటి వసూళ్లు:- వైసీపీ నేత అంబటి రాంబాబుపై గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ వేశారు. సత్తెనపల్లిలో పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అంబటి నేతృత్వంలో లక్కీ డ్రా పేరుతో లాటరీ టికెట్ల విక్రయాలు జరిగాయి. సచివాలయ వలంటీర్స్ ద్వారా ఈ టికెట్ల అమ్మకాలు జరిగాయి. 2023లో సంక్రాంతి లక్కీ డ్రా లాటరీ టికెట్లు అమ్మకాలపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు సబ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో అంబటి రాంబాబుపై 2023 జనవరి 16న సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ లక్కీ డ్రా కేసులో తాజాగా పీటీ వారెంట్ జారీ అయింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *