బీజెపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నిక ఏకగ్రీవం
అమరావతి: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్(45) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సోమవారం బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్‌ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్‌లు దాఖలు కావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా అయింది.నితిన్ నబీన్ పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీతో పాటు అమిత్‌షా,,రాజ్‌నాథ్ సింగ్ లు సంతకాలు చేశారు.మంగళవారం ఉదయం 11 గంటలకు డిల్లీలోని బీజేపీ కార్యాలయంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. బీజేపీ చరిత్రలో పిన్న వయస్సులో జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ రికార్డ్ సృష్టించబోతున్నారు. బీహార్ అసెంబ్లీకి 5 సార్లు ఎమ్మెల్యేగా నితిన్ నబీన్ ఎన్నికైన నితిన్ నబీన్ బిహార్ రాష్ట్ర బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

