చట్టవిరుద్ధంగా వాకీ-టాకీలు విక్రయించిన ఈ-కామర్స్ సంస్థలకు జరిమాన
అమరావతి: లైసెన్సింగ్, ఫ్రీక్వెన్సీ అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా వాకీ-టాకీలు విక్రయిస్తున్న ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (CCPA) స్వయంగా చర్యలు చేపట్టింది.13 ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్‌కు రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించింది. చిమియా, జియోమార్ట్, టాక్ ప్రో, మీషో, మాస్క్‌మ్యాన్ టాయ్స్, ట్రేడ్ ఇండియా, ఆంత్రిక్ష్ టెక్నాలజీస్, వర్దాన్‌మార్ట్, ఇండియామార్ట్, మెటా ప్లాట్‌ఫామ్‌లు ఇంక్. (ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్), ఫ్లిప్‌కార్ట్, కృష్ణ మార్ట్, అమెజాన్ సంస్థలు 16,970కు పైగా చట్టవిరుద్ధంగా వాకీ-టాకీలు అమ్మినట్లు సీసీపీఏ గుర్తించింది. జనవరి 1-14 తేదీలలో జారీ చేసిన రెండు వేర్వేరు ఉత్తర్వులలో, చీఫ్ కమిషనర్ నిధి ఖరే & కమిషనర్ అనుపమ్ మిశ్రా నేతృత్వంలోని కమిటీ, ఇటువంటి జాబితాలు జాతీయ భద్రతపై తీవ్రమైన ప్రభావాల వుంటాయని పేర్కొన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం వినియోగదారుల సమాచారం పొందే హక్కును ఉల్లంఘిస్తున్నాయని,, తప్పుదారి పట్టించే ప్రకటనలు,చట్ట విరుద్దమైన వాణిజ్య పద్ధతులకు సమానమని వెల్లడించారు. ఆయా ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారుల రక్షణ చట్టాలను ఉల్లంఘించిన ఎనిమిది సంస్థలకు తుది ఉత్తర్వులు జారీ చేసింది. వాటికి రూ.44 లక్షల జరిమానాలు విధించింది.

