జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్ గా రాకేష్ అగర్వాల్ నియమకం
అమరావతి: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్ గా రాకేష్ అగర్వాల్‌ను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) నియమించింది. 1994 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ఆగస్టు 31, 2028 వరకు పదవీలో కొనసాగనున్నారు. “రాకేష్ అగర్వాల్ నియామకానికి హోం మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనను క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది.1994 హిమాచల్ IPS క్యాడర్‌కు కు చెందిన అగర్వాల్, SDG, NIA డైరెక్టర్ జనరల్‌గా, “జాతీయ దర్యాప్తు సంస్థ (పే మ్యాట్రిక్స్ యొక్క స్థాయి-16) పదవి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి మరియు 31.08.2028 వరకు అంటే ఆయన పదవీ విరమణ చేసిన తేదీ లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందు అయితే అది వరకు చెల్లుబాటు అవుతుంది” అని నియామక లేఖలో పేర్కొన్నారు. క్యాబినెట్ నియామకాల కమిటీ తర్వాత ఆయన NIA కొత్త డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని జరిగినఈ సమావేశం, అగర్వాల్ నియామకంను అమోదించింది. NIA మాజీ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ ను మహారాష్ట్ర కేడర్‌కు పంపింది. దీంతో NIA DGగా అగర్వాల్‌కు పదోన్నతి లభించింది. ఏజెన్సీతో అగర్వాల్ కు సుదీర్ఘ అనుబంధం ఉంది. సంస్థలో సంక్లిష్ట దర్యాప్తులను నిర్వహించడంలో అనుభవం ఆయన తాజా నియామకానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

