థాయిలాండ్‌లో ఘోర రైలు ప్రమాదం-22 మంది మృతి
అమరావతి: థాయిలాండ్‌లో బుధవరం వేకువజామున 2 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా, మరో 80 మందికిపైగా గాయపడ్డారు. కదులుతున్న రైలుపై ఓ క్రేన్ జారిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో బుధవారం వేగంగా వెళ్తున్న రైలుపై క్రేన్ పడటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ క్రేన్ అదుపుతప్పి కింద పడడం,, అదే సమయంలో కింద ఉన్న పట్టాలపై నుంచి ప్రయాణికులతో రైలు వెళ్తోంది. దీంతో రైలు బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీల్లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో రైలులో 195 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
కూలిపోయిన క్రేన్ దాదాపు $5.4 బిలియన్ల విలువైన హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులో భాగం. ఇది థాయిలాండ్‌లో హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్ ను నిర్మించడానికి చైనా చేపట్టిన ప్రాజెక్ట్ ఇది.చైనా, “బెల్ట్ అండ్ రోడ్” మౌలిక సదుపాయాలను కల్పనతో 2028 నాటికి బ్యాంకాక్‌ను లావోస్ ద్వారా చైనాలోని కున్మింగ్‌కు అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు AFP న్యూస్ ఏజెన్నీ పేర్కొంది.

