అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం-కలెక్టర్
నెల్లూరు: అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల సహాయార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతము, దాని సమీప తూర్పు భారత మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండం మారిన కారణంగా ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నెల్లూరు జిల్లాకు చిన్నపాటి నుంచి మోస్తరు వర్షాలు చెదురు మదురుగా కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజల నుండి వచ్చే ఫోన్ కాల్స్ స్వీకరించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టుటకు కంట్రోల్ రూమ్ లో షిఫ్టులవారీగా కలెక్టరేట్ సిబ్బందిని నియమించినట్లు ఆయన తెలిపారు. ప్రజలందరూ అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్లు 0861-2331261 / 7995576699 /1077 లలో సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

