హౌరా-గువహటిల మధ్య తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ సర్వీస్ ప్రారంభం-మంత్రి అశ్వినీ వైష్ణవ్
అమరావతి: అత్యంత అధునికి సౌకర్యలు వున్న తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ సర్వీస్ అతి త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. గువహటి-కోల్‌కతాల మధ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రయాణించనున్నదని తెలిపారు.బుధవారం 180 కిలోమీటర్ల స్పీడుతో వందే భారత్ స్లీపర్ ట్రైన్ పరీక్ష విజయవంతంగా జరిగిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ప్రారంభిస్తారని వెల్లడించారు.
టిక్కెట్ల ధరలు:- పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, అస్సాంలోని గువహటిల మధ్య నడిచే ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ టికెట్ ధరలు విమాన టికెట్లకంటే చాలా తక్కువగా ఉంటాయన్నారు. వందే భారత్ స్లీపర్ ట్రైన్ టికెట్ ధరలు నాన్ ఏసీ టికెట్ ధర రూ.2,300/- అందులోనే ఆహారం కూడా అందిస్తారు. సెకండ్ AC టికెట్ రూ.3000/- ,,1st AC టికెట్ ధర రూ.3,600/- ఉంటుందన్నారు.
ఈ రైళ్లు 1200-1500 కిలోమీటర్ల దూరం ఉండే రైలు మార్గాల్లో నడవనున్నాయి. ప్రతి వందే భారత్ స్లీపర్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. AC 3 టైర్-11,,2nd AC 2 టైర్-4,,st1 AC కోచ్-1లు వుంటాయి. ఈ రైలు 823 మంది ప్రయాణికులకు సేవాలు అందిస్తుంది. రాబోయే 6 నెలల్లో 8 వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు వైష్ణవ్ తెలిపారు. 2026 చివరి నాటికి మొత్తం రైళ్ల సంఖ్య 12కి చేరుతుందన్నారు. అస్సాంలోని కామ్రూప్ మెట్రోపాలిటన్, బోంగాయ్‌గావ్. పశ్చిమ బెంగాల్ లోని కూచ్‌బెహార్, జల్పాయ్గురి, మాల్దా, ముర్షిదాబాద్, పూర్బ బర్ధమాన్, హూగ్లీ, హౌరా మార్గాల్లో ప్రయాణిస్తాయి.(పైన తెలిపిన వివరాల్లో చిన్నపటి మార్పులు వుండే అవకాశం)

