కాపు భవన్లో అదనపు అంతస్తుకు శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ..
నెల్లూరుం 2026 జూన్ 12 నాటికి కాపు భవనాన్ని పూర్తిస్థాయిలోకి అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు.. బుధవారం ఇరుగాలమ్మ గుడి వద్ద ఉన్న కాపు భవనానికి అదనపు అంతస్తుకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు.2014-19 కాలంలో అప్పుడు ఉన్న 13 జిల్లాలలో జిల్లాకు ఒక కాపు భవన్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించడం జరిగిందని తెలిపారు…తదనుగుణంగా మూడు ఎకరాల 41 సెంట్లు భూమిని 41 డివిజన్లో కేటాయించడం జరిగిందన్నారు. భవన నిర్మాణానికి తమ పిల్లలు కోటి రూపాయలు అప్పట్లో ఇవ్వడం జరిగిందన్నారు. గత కొంతకాలంగా భవనం నిరాదరణకు గురై మంచినీటి వసతి లేక, స్లాబులు పెచ్చులు వాడడం వంటివి జరిగాయని,అదనపు భవనం ఏర్పాటుకు రెండు కోట్లతో అంచనాలు వేయడం జరిగిందని,, దానిలో కోటి రూపాయలు నారాయణ గ్రూప్ నుంచి ఇవ్వడం జరుగుతుందన్నారు. మరో కోటి రూపాయలు సీయస్ ఆర్ ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. జూన్ 2026 జూన్ 12 నాటికి పనులు పూర్తి చేసి కాపు భవనాన్నీ ప్రజలకు అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు. పేదలు,నిరుపేదలు అతి తక్కువ ఖర్చుతో కాపు భవనాన్ని వాడుకోవచ్చు అని తెలిపారు.కాపు భవన్ నిర్వహణకు కమిటీని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని, దానికి కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మేయర్ రూప్ కుమార్,కమీషనర్ నందన్,అనురాధ, విజేత,భాను శ్రీ, గిరిధర్ రెడ్డి, కాపు నాయకులు అశోక్,కిషోర్, శ్రీనివాసలు,స్థానిక జనసేన టిడిపి,బీజేపీ నేతలు పాల్గొన్నారు.

