వైద్య,విజ్ఞాన,గణిత శాస్త్రల్లో అధ్భుతలను అవిష్కరించింది భారతీయులే-సీ.ఎం చంద్రబాబు
భారతీయుల డీఎన్ఏలో మాత్రమే-మోహన్ భగవత్..
తిరుపతి: ఖగోళశాస్త్రంలో ఆర్యభట్ట, గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, ఆర్థిక శాస్త్రంలో కౌటిల్యుడు వంటి గొప్ప మేధవులు జన్మించిన భూమి, భారతదేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.శుక్రవారం శుక్రవారం తిరుపతిలోని సంస్కృతి యూనివర్సిటీలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్‌ను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నో వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో హరప్పా నాగరికత చాటి చెప్పిందని,,2900 ఏళ్ల క్రితమే యోగాభ్యాసం చేశామని, ప్రధాని మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవరం రికార్డు స్థాయిలో నిర్వహించాం అని చెప్పారు.నేడు 150 దేశాలు యోగాను సాధన చేస్తున్నాయన్నారు.2600 ఏళ్ల క్రితమే భారత దేశం ఆయుర్వేదం ద్వారా వైద్య సేవలు అందించింది..పూర్వ కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల విశ్వ విద్యాలయం నిర్మించుకున్న దేశం మనది..1600 ఏళ్ల క్రితమే నలంద యూనివర్శిటీ ద్వారా ఆధునిక విద్యను అందించిన ఘన చరిత్ర అలాగే గణితంలో(0) సున్నాను భారతీయులే కనుగొన్నారని తెలిపారు.సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతూ.. దేశాభివృద్ధి కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కృషి చేస్తున్నారని కొనియాడారు.
మోహన్ భగవత్:- భారతీయ విజ్ఞాన సమ్మేళనం లక్ష్యం జ్ఞానమని,, దీనిని ప్రపంచంలోని అందరికీ దగ్గర చేయాల్సి ఉందన్నారు. ఎవరికి ఏ భాష వచ్చొ ఆ భాషను ప్రజలకు అందుబాటులోకి తీసుకుపోవాల్సి ఉందన్నారు. అప్పుడే అందరిలో బుద్ధి వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. భారతీయుల డీఎన్ఏలో మాత్రమే ధర్మ దృష్టి ఉందని ఆయన స్పష్టం చేశారు. భారత్ విశ్వ గురువు కావాలని ఆకాంక్షించారు. ఆర్థిక, సామాజిక, ధర్మ జ్ఞానాల్లో సంపూర్ణంగా మనం ప్రపంచానికి శక్తిని..దృష్టిని.. ఇవ్వాల్సి ఉందని మోహన్ భగవత్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అభివృద్ధితోపాటే వినాశనం సైతం వచ్చేసిందంటూ ఆందోళన వ్యక్తం చేసిన మోహన్ భగవత్,, శాస్త్ర విజ్ఞానంతోనే మానవాళికి సదుపాయాలు కలుగుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

