నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ శంకుస్థాపన హాజరుకావాలి-సీఎం
అమరావతి: నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ ఎస్ పూరీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసిన సందర్బంలో సీ.ఎం చంద్రబాబు అయనకు ప్రాజెక్టు ప్రారంభించేందుకు తీసుకున్న పలు చర్యలను వివరించారు.రూ. 96,862 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద సమగ్ర ఇంధన ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6,000 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందించినట్టు వెల్లడించారు.’ప్రాజెక్ట్ కు సంబంధించిన పబ్లిక్ హియరింగ్ విజయవంతంగా పూర్తయ్యిందని,, పర్యావరణ అనుమతులు కూడా త్వరలోనే రానున్నాయని,,ప్రాజెక్ట్ అన్ని దశల్లో వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉద్యోగావకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి,, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి గణనీయమైన తోడ్పాటు లభించనుంది’ అని సీఎం చంద్రబాబు వివరించారు.

