జాపాన్ లో తీవ్రత భూప్రకంపనలు-సునామీ ముప్పు
రిక్టర్ స్కేలుపై 7.6 నమోదు..
అమరావతి: జాపాన్ ఉత్తర తీరంలో రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత భూప్రకంపనలు నమోదు అయ్యియి. హక్కాయిడో ద్వీపంలోని తీరప్రాంత రాజధాని అమోరీకి సమీపంలో సముద్రం అడుగున 50 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు సోమవారం రాత్రి 11:15 గంటలకు (14:15 GMT) ఆఫ్‌షోర్‌లో భూకంపం సంభవించిన తర్వాత జపాన్ ఈశాన్య తీరాన్ని 3 మీటర్లు (10 అడుగులు) ఎత్తులో సునామీ తాకవచ్చని జపాన్ వాతావరణ సంస్థ (JMA) తెలిపింది. ఈ నేపథ్యంలో అక్కడి అణువిద్యుత్ కేంద్రాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా విద్యుత్ కేంద్రాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. భూకంప కేంద్రానికి 1000 కిలోమీటర్ల పరిధిలోని తీర ప్రాంతాలకు సునామీ ముప్పు పొంచి ఉందని జపాన్ అధికారులు తెలిపారు. జపాన్‌తో పాటు రష్యాకు కూడా సునామీ ముప్పు ఉందని తెలిపారు.

