మంగళవారం యధావిధిగా పాఠశాలలు పని చేస్తాయి-జాయింట్ కలెక్టర్
నెల్లూరు: జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అంగన్వాడీ పాఠశాలలు, అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జునియర్ కళాశాలలు ఈ నెల 2వతేది (మంగళవారం) యధావిధిగా పనిచేస్తాయని జేసి మొగిలి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ఉత్తర్వులను అన్ని రకాల పాఠశాలలు, జానియర్ కళాశాలల యాజమాన్యాలు విధిగా అమలుచేయాలని జేసి ఆదేశించారు.సోషల్ మీడియాలో మంగళవారం సెలవు అని వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని, అన్ని రకాల పాఠశాలలు, కాలేజీలు యధావిధిగా పనిచేస్తాయని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించాలని తెలిపారు.

