స్థానిక సంస్థలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల
తెలంగాణ: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని మంగళవారం సాయంత్రం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,, తెలంగాణలో కోటి 66 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారన్నారు..12,728 సర్పంచ్ స్థానాలు, 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు.. మంగళవారం నుంచి MCC CODE అమలులోకి వస్తుందన్నారు..31 జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు.. డిసెంబర్ 11,14,17 తేదీల్లో పోలింగ్ జరుగుతుందని తలిపారు.. ఓట్ల లెక్కింపు,, పోలింగ్ ఒకే రోజు ఉంటుందని వెల్లడించారు.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని,,మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.. నవంబర్ 27వ తేదీ నుంచి తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తారని,, రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30వ తేదీ నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు.
మూడు విడతల్లో ఎన్నికలు:-
డిసెంబర్ 11వ తేదీన తొలి విడత,
డిసెంబర్ 14వ తేదీన రెండో విడత,
డిసెంబర్ 17వ తేదీన మూడో విడత ఎన్నికలు..
మొదటి ఫేజ్ నామినేషన్ నవంబర్ 27వ తేదీ నుండి,
రెండవ ఫేజ్ నామినేషన్ నవంబర్ 30వ తేదీ నుండి,
మూడవ విడత నామినేషన్ డిసెంబర్ 3వ తేదీ నుండి మొదలు అవుతాయి.

