ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర కారులో బాంబు పేలుడు-10 మంది మృతి
అమరావతి: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం దాదాపు 6.40 నిమిషాలకు పేలుడు సంభవించింది.. మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు సంభవించినట్లు తెలుస్తొంది.. పేలుడు ధాటికి పార్కింగ్ ఏరియాలో వున్న 5 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి..ఈ సంఘటనలో 10 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం వస్తొంది..పార్కింగ్ ఏరియాలో వున్న మరి కొన్ని కార్లకు మంటలు వ్యాపించాయి.. సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్ సిబ్బంది,, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.. 7 ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు..ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఫోర్స్ సంఘటనా స్థలికి చేరుకుంది.. పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.పూర్తి సమాచారం తెలియాల్సివుంది.

