AP&TGCRIME

ఎర్రచందనం స్మగ్లర్స్ ను తీవ్రంగా హెచ్చరించిన పవన్ కళ్యాణ్

తిరుపతి: వెంకటేశ్వరస్వామికి గాయం అయినప్పుడు అయన నుదలపై నుంచి నేలపై పడిన రుధిరం, ఎర్రచందన చెట్టు రూపంలో మొలకేత్తిందని,,అలాంటి చెట్లను నరికి,స్మగ్రింగ్ చేస్తున్న వారికి తాట తీస్తానంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు.శేషచలం అడవుల్లోని ఎర్రచందనం చెట్లను కాపాడుకొవాల్సి బాధ్యత శ్రీవారి భక్తులకు కూడా వుందన్నారు..శనివారం తిరుపతిలో పర్యటించి శేషచలం అడవులను పరిశీలించారు.అనతరం మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ ను శనివారం మధ్యాహ్నం ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం Lots వివరాలు అడిగి తెలుసుకున్నారు.A,B,C నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గోడౌన్ లో రికార్డులు పరిశీలించారు.ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *