VRC హైస్కూల్ గ్రౌండ్స్ లో బాస్కెట్ బాల్ కోర్టుల విధ్వసమే లక్ష్యంగా నగరపాలక సంస్థ
విజ్ఞాత చూపాల్సిన మంత్రులు విధ్వసంను ప్రొత్సహిస్తున్నారా?
నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థకు నగరంలో ఎక్కడ స్థలమే లేనట్లుగా,ఏ కార్యక్రమం నిర్వహించాలన నగరం నడిబొడ్డులో వున్న VRC హైస్కూల్ గ్రౌండ్స్ లో బాస్కెట్ బాల్ కోర్టులే కన్పిస్తాయి. VRC హైస్కూల్ బాస్కెట్ బాల్ కోర్టుల్లో గత 50 సంవత్సరాల నుంచి వందలాది మంది బాస్కెట్ బాల్ క్రీడాకారులు తయారు అయ్యారు. వీరిలో చాలా మంది స్పోర్ట్ కోటాలో ఉద్యోగాలు పొందారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో నెల్లూరుజిల్లా బాస్కెట్ బాల్ టీమ్ అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు వుంది. అలాంటి టీమ్స్ లో అడే క్రీడాకారులు VRC హైస్కూల్ బాస్కెట్ బాల్ కోర్టులో శిక్షణ పొందివారే. జిల్లా బాస్కెట్ బాల్ క్రీడాకు ప్రస్తుత దేవాదాయశాఖ మంత్రి ఆనం.రామనారాయణరెడ్డి చేసిన కృషి ఎంతో వుంది.
అధికారులు నిర్లలక్ష్యంగా:- నేటికి VRC హైస్కూల్ బాస్కెట్ బాల్ కోర్టుల్లో ప్రతి రోజు దాదాపు 20 పిల్లలు ఉధయం శిక్షణ తీసుకుంటున్నారు. ఈ విషయం వి.ఆర్.సి గ్రౌండ్ వైపు వచ్చే ప్రతి ఒక్కరికి కన్సిస్తుంది. అలాగే కార్పరేషన్ లో సో కాల్డ్ అధికారులకు తెలుసు.బాస్కెట్ బాల్ కోర్టులో షామియాలను వేస్తున్న ప్రతి సారి క్రీడాకారులు వ్యతిరేకిస్తున్న అధికారులు నిర్లలక్ష్యంగా వ్యవహరించడం అంటే వారి ఆహంకారం ఏ స్థాయిలో వుందొ ఆర్దం అవుతుంది. నగరంను అన్ని రకాలుగా అభివృద్ది చేస్తున్న మంత్రి నారాయణ దృష్టికి ఈ విషయం వచ్చిందా? టపాసుల అంగళ్ల కోసం ప్రతి సంవత్సరం VRC హైస్కూల్ గ్రౌండ్స్ లో దాదాపు 60 నుంచి 70 అంగళ్ల వరకు ఏర్పాటు చేస్తారు. ఈ సారి టపాసులు అంగళ్లకు సంబంధించిన కాంట్రాక్టర్లు ఏకంగా బాస్కెట్ బాల్ కోర్టులోనే ఇనుప పైపులతో కూడిన షామియానలను ఏర్పాటు చేయడం దారుణమైన విషయం? ఇదేమిటని ప్రశ్నించగా RDO పర్మిషన్ ఇచ్చాడు….నగరపాలక సంస్థ కమిషన్ ఒకే అన్నారు కాబట్టే అంగళ్లు ఏర్పాటు చేస్తున్నమని,షామియాలను ఏర్పాటు చేస్తున్న కాంట్రాక్టర్ బదులు ఇచ్చారు? VRC హైస్కూల్ గ్రౌండ్,, బాస్కెట్ బాల్ కోర్టులు దుస్థితి ప్రశ్నించే వాడు లేకపోవడంతో ఆనాధలుగా మిగిలిపోతున్నాయి.? మంత్రి నారా.లోకేష్ దృష్టికి:- ఈ విషయమై MROకి ఫోన్ చేయగా మాకు పరిథిలోని కాదు మీరు RDOను సంప్రదించండి అంటూ సమాధానం ఇచ్చారు. RDO చేయగా అయన ఫోన్ లిప్ట్ చేయలేదు. మరి ఈ విషయం ఎవరి దృష్టికి తీసుకుని వెళ్లాలి?? రాష్ట్రంలోని పలు సమస్యలపై వేగంగా స్పందిస్తున్న ఐ.టీ శాఖ మంత్రి నారా.లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లితే,,మంత్రి చొరవ చూపితే సమస్యకు పరిష్కారం దొరుకుంతుందేమో???
