ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన రామ్ చరణ్ దంపతులు
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి క్రీడలపై ఉన్న ఆసక్తి, ఆయన మార్గదర్శకత్వం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని,, ఆర్చరీని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడంలో తోడ్పాటును అందిస్తోందని స్టార్ హీరో రామ్ చరణ్ తెలిపారు.ఆర్చరీ ప్రీమియర్ లీగ్(APL)కు స్టార్ హీరో రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆదివారంతో ఏపీఎల్ గ్రాంఢ్ ఫినాలే ముగియనున్న సందర్బంలో రామ్ చరణ్, తన సతీమణి ఉపాసనతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని. ఈ సందర్భంగా రామ్ చరణ్, ప్రధాని మోదీకి శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహూకరించారు. ఈ సమావేశం విశేషాలను రామ్ చరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో ప్రధానిని కలిసినట్టు తెలిపారు. ఈ లీగ్‌లో పాల్గొన్న క్రీడాకారులందరినీ రామ్ చరణ్ అభినందించారు. శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఉపకరిస్తాయని.. మరింత మంది ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే తొలి ప్రొఫెషనల్ ఆర్చరీ లీగ్‌గా ఏపీఎల్‌కు పేరుంది.