ఈ నెల 16న ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన ఖరారు
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16వ తేదీన రాష్ట్రంలో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లాలో మోదీ పర్యటన కొనసాగనుంది. ఇందుకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదలైంది.
16న ఉదయం 7.50 కు ప్రధాని మోదీ దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి,,ఉదయం 10.20 కు కర్నూలు ఎయిర్‌పోర్ట్ కు చేరుకోనున్నారు.11.10 కి రోడ్డుమార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. 11.45కి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1.40 కి సునిపెంట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 2.30 కు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 4.15కు రోడ్డుమార్గంలో నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకుని సాయంత్రం 4.40 కు కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీకి బయలుదేరుతారు.