అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీల ఆసక్తి-మంత్రి నారాయణ
అమరావతి: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ది పనులను మంత్రి నారాయణ మలేషియా ప్రతినిధులకు వివరించారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రణాళికాబద్దంగా అమరావతి నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు..మలేషియా ప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ అమరావతి నిర్మాణ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు..సచివాలయంలో మలేషియా సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు.
నిర్ధేశిత గడువు లోపు నిర్మాణాలు పూర్తి:- ఇప్పటికే 51 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయి,పనులు కూడా ప్రారంభమయ్యాయని,నిర్ధేశిత గడువులతో నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నామన్నారు..కేపిటల్ సిటీలో 360 కిమీ మేర ట్రంక్ రోడ్లు ఏడాదిన్నలోపు, 1500 కిమీ మేర లే అవుట్ రోడ్లు రెండేళ్లలోగా,అధికారులు,ఉద్యోగులు,ప్రజాప్రతినిధులకు చెందిన 4000 ఇళ్లను వచ్చే మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నామన్నారు.మంత్రి నారాయణ మలేషియా బృందానికి వివరించారు.
10 వేల కోట్లు పెట్టుబడులు:- అమరావతిలో రాబోయే ఐదేళ్లలో 6 వేల నుంచి 10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. మలేషియాలోని సైబర్ జయ యూనివర్శిటీ ముందుకొచ్చింది…అలాగే ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటుకు బెర్జయ(BERJAYA) గ్రూప్ ముందుకొచ్చింది. అమరావతి అభివృద్దికి భారత్ తో కలిసి పనిచేస్తామని మలేషియా మంత్రి పప్పారాయుడు తెలిపారు..
ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్,సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు,సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ తేజ పాల్గొన్నారు.