NATIONAL

ఆర్ఎస్ఎస్‌ అంతిమ లక్ష్యం జాతీయ సమైక్యతే-ప్రధాని మోదీ

అమరావతి: ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు దేశానికి సేవ చేయడానికి,సమాజానికి సాధికారత కల్పించడానికి అవిశ్రాంతంగా అంకితభావంతో పని చేస్తున్నే ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉన్నదని,,ఇది సహించలేని పొరుగుదేశాలు సమాజంలో చిచ్చుపెట్టేందుకు నిరంతరాయంగా ప్రయత్నిస్తునే వున్నరని,అలాంటి వారి నుంచి ప్రమాదాలు ఎదుర్కొంనేందుకు ప్రజలు ఆప్రమత్తంగా వుండాలని ప్రధాని మోదీ కోరారు. బుధవారం న్యూఢిల్లీలో బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్ని రూ.100 నాణెంతో పాటు పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు.

ఒకే సూత్రం-‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’:-  అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తు,,ఆర్ఎస్ఎస్ సేవలను ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ రోజు విడుదల చేసిన స్మారక స్టాంపు 1963 గణతంత్ర దినోత్సవ మర్చింగ్ లో సగర్వంగా కవాతు చేసిన ఆర్ఎస్ఎస్ వాలంటీర్లను గుర్తుచేసుకునే నివాళి అని అన్నారు.’దేశం ముందు’ అనే ఒకే సూత్రం-‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ అనే ఒకే లక్ష్యంతో ఆర్‌ఎస్‌ఎస్ లెక్కలేనన్ని త్యాగాలు చేసిందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంస్థ కాదని,, వ్యక్తిత్వ వికాసం ద్వారా దేశ నిర్మాణం కోసం పాటు పడే శక్తి అని అభివర్ణించారు. నేను అనే అహాన్ని వీడి, మనం అనే సామూహిక భావన వైపు నడిపించే ప్రయాణమే ఆర్ఎస్ఎస్ అని అన్నారు. ఆర్ఎస్ఎస్‌కు అనేక అనుబంధ సంస్థలు ఉన్నా,, వాటి అంతిమ లక్ష్యం జాతీయతే అగ్రస్థానమని స్పష్టం చేశారు.

దాడులను తట్టుకుని నిలబడింది:- ఈ అనుబంధ సంస్థల మధ్య వైరుధ్యాలు ఉండవని పేర్కొన్నారు. సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ దేశ నిర్మాణంతోపాటు స్వాతంత్ర్య పోరాటం కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. స్వాతంత్ర్యం అనంతరం ఆర్ఎస్ఎస్‌పై అనేక దాడులు జరిగాయని,,అలాంటి వాటని తట్టుకుని నిలబడిందని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *