DEVOTIONALDISTRICTSOTHERS

ఐదు కోట్లతో రాజరాజేశ్వరి గుడిలొ ధ్యాన మందిరం-మంత్రి ఆనం

నెల్లూరు:నగరంలోని రాజరాజేశ్వరి గుడి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ధ్యాన మందిరం,,కల్యాణ మండపాన్ని సుమారు ఐదు కోట్ల రూపాయలతో నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి వెల్లడించారు. మంగళవారం స్థానిక రాజరాజేశ్వరి గుడిలో దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యాన మందిరం,కళ్యాణ మండపం ఏర్పాటుకు అవసరమయ్యే ఐదు కోట్ల రూపాయలలో కోటి రూపాయలు దాతలు ఇవ్వనున్నట్లు మిగిలిన నాలుగు కోట్ల రూపాయలు దేవాదాయ శాఖ సమకూర్చడం జరుగుతుందన్నారు.  రూరల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,ఆలయ కమిటీ కోరిక మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలకు 10 వేలు: దీనికి సంబంధించి త్వరలోనే దేవదాయ శాఖ ఉన్నతాధికారులు,ఇంజనీర్లు రాజరాజేశ్వరి గుడిని పరిశీలించనున్నారని ఆయన తెలిపారు.గతంలో జరిగిన అనేక అపచారాలను పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రక్షాళన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ప్రతి ఆలయంలో అధ్యాత్మిక శోభా కనిపించే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను 98 శాతం పూర్తి చేశాం అని తెలిపారు.వాసవీ కన్యకా పరమేశ్వరి నిర్మాణాన్ని పెనుగొండ గ్రామంలో ప్రభుత్వ పండుగగా నిర్వహిస్తున్నామని,, ఆదాయం లేని సుమారు 5 వేల పైచిలుకు చిన్న ఆలయాలకు ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలకు 10 వేలు రూపాయలు అందజేయడం జరుగుతున్నదని, దీనికి సంబంధించిన నిధులు కూడా కేటాయించడం జరిగిందన్నారు.

ఆలయ అర్చకులకు 15 వేలు:- ఆగమ పండితుల సూచనల మేరకే ఆలయాల్లో పూజాధికాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.వేదాధ్యయనం చేసిన వేద పండితులకు వారికి నెలకు మూడు వేల వంతున 600 మందికి అందజేసే విధంగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఆలయ అర్చకులకు 15 వేల రూపాయలను అందజేయడం జరుగుతున్నదని తెలిపారు.ట్రస్ట్ బోర్డులో బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణుల ఉండాలని చట్టాన్ని సవరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మేల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జనార్దన్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *