దేశవ్యాప్తంగా 10 వేల MBBS, P.G సీట్ల సంఖ్యను పెంచుతూ కేంద్ర కేబినేట్ నిర్ణయం
అమరావతి: దేశంలో వైద్య విద్యకు సంబంధించి (P.G)పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ (MBBS) సీట్లను పెంచేందుకు బుధవారం ప్రదాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపింది. 5,023 MBBS సీట్లను పెంచడానికి, ప్రస్తుత ప్రభుత్వ వైద్య కళాశాలల అప్‌గ్రేడ్ కోసం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్(CSS) విస్తరణకు ఆమోదం తెలిపింది..దింతో దేశంలో వైద్య విద్య సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది..సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ 3వ దశ కింద ప్రస్తుత ప్రభుత్వ వైద్య కళాశాలల అప్‌గ్రేడేషన్ ద్వారా 5,000 కొత్త పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) సీట్లు,, 5,023 MBBS సీట్లు అందుబాటులోకి రానున్నాయి.. ఈ పథకం కింద, కేంద్రం మొదటి దశలో 83 కళాశాలల్లో 4,977 MBBS సీట్లను రూ.5,972 కోట్లతో, 72 కళాశాలల్లో 4,058 PG సీట్లను రూ.1,498 కోట్లతో ఖర్చు చేయనున్నారు.
రూ.15,034 కోట్ల బడ్జెట్ 2025-26 నుంచి 2028-29 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.. ఇందులో కేంద్రం వాటా రూ.10,303.20 కోట్లు,,రాష్ట్రాల వాటా రూ.4,731.30 కోట్లు.. ఈ విస్తరణ వైద్యులు, స్పెషలిస్టుల సంఖ్యను పెంచి గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపరుస్తుంది.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మార్పుల అమలుకు మార్గదర్శకాలు వెంటనే జారీ చేయనున్నది.