NATIONAL

అనేక వస్తువులపై సున్నా శాతం GST ఉంటుంది-ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు..” సోమవారం నుంచి దేశంలో ‘GST బచత్ ఉత్సవ్’ ప్రారంభం కానున్నదని,, మీ పొదుపు పెరుగుతుంది అదే సమయంలో మీకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు” అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు..ఇది  పేద మధ్య తరగతి వర్గాలకు డబుల్ బొనంజా అని అభివర్ణించారు.. ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ,  GST అమలుతో వన్ నేషన్-వన్ ట్యాక్స్ కలలు సాధ్యం అయ్యాయని అన్నారు.. GSTలో తీసుకుని వచ్చిన మార్పులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు..

అనేక వస్తువులపై సున్నా శాతం GST:- గతంలో దేశంలో అనేక రకాల పన్నులతో ప్రజల్లో గందరగోళం ఉండేదని,, GSTని ప్రవేశ పెట్టడడంతో ప్రజలు గందరగోళం నుంచి బయటపడ్డారని అన్నారు. సోమవారం నుంచి నిత్సావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయని,, కొత్త GST స్లాబ్స్ అమలుతో ఉత్పత్తిదారులు,, వినియోగదారలకు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు..వస్తు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయన్నారు.. 12 శాతం పన్ను ఉన్న 99 శాతం వస్తువులు 5 శాతం పన్నులోకి వచ్చాయని,, పేదలు వాడే అనేక వస్తువులపై సున్నా శాతం GST ఉంటుందని తెలిపారు..

దేశ ప్రజల పొదుపు కూడా:- GSTసంస్కరణలతో పెట్టుబడుల ప్రవాహనం పెరుగుతుందని,,ఇదే సమయంలో దేశ ప్రజల పొదుపు కూడా పెరుగుతుందని అన్నారు.. అన్ని రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే ఇంత పెద్ద సంస్కరణలు తీసుకవచ్చామని వివరించారు..పర్యాటక రంగానికి GST సంస్కరణలు ఎంతో మేలు చేస్తాయని,,లాడ్జీలు,,హోటల్స్ సేవలపై కూడా GST తగ్గించామని తెలిపారు.

భారతదేశంలో తయారు అయిన ఉత్పత్తులే వాడాలి:- మేడిన్ ఇండియా ఉత్పత్తులే వాడాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు..దేశం సమృద్ధిగా ఉండాలంటే దేశీయ ఉత్పత్తులే వాడలని సూచించారు.. మన ఉత్పత్తుల నాణ్యత దేశ గౌరవాన్ని మరింత పెంచుతోందని,, నాగరిక్‌ దేవోభవన అనే మంత్రంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *