CRIMENATIONAL

ఢిల్లీలో తీగ లాగితే రాంచీలో ISIS ఉగ్రవాది బయట పడ్డాడు

అమరావతి: రాంచీలోని ఒక హోటల్ రూమ్‌లో ISIS ఉగ్రవాదుల కోసం బాంబులు తయారు చేస్తూ విద్యార్థి ముసుగులో వున్న ఉగ్రవాది దొరికిపోయాడు. 10వ తరగతి (SSC) పరీక్షలకు రెడీ అవుతున్నానని చెప్పుకుంటూ, అష్హార్ డానిష్ అనే యువకుడు రాంచీలోని ఇస్లామ్‌నగర్ ప్రాంతంలోని (ఒక పాత బిల్డింగ్) తబారక్ లాడ్జ్ హోటల్ రూమ్ నంబర్ 15లో ఉగ్రదాడుల కుట్రలకు పాల్పపడుతున్నాడు. రూమ్‌లో బాంబు తయారు చేయడమే కాకుండా,, ఉగ్రవాదుల నియామించే కేంద్రంగానూ తయారుచేశాడు.
బాంబులను పరీక్షించేందుకు:- ఢిల్లీ పోలీసులు, అఫ్తాబ్ ఖురేషీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తరువాత ఈ కుట్ర బయటపడింది. అఫ్తాబ్ గురించి వచ్చిన సమాచారంతో జార్ఖండ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్‌తో కలిసి దాడులు నిర్వహించిన ఢిల్లీ పోలీసులు, డానిష్‌ను అరెస్ట్ చేశారు. రూమ్‌లో గన్‌పౌడర్, బాంబులు, పొటాషియం నైట్రేట్ లాంటి కెమికల్స్ ను ఉపయోగించి పేలుడు పదార్థాలు సొంతంగా తయారు చేసిన బాంబులను స్వాధీనం చేసుకున్నారు. బాంబులను పరీక్షించేందుకు సబర్నరేఖ నదిలో బాంబులు పేల్చినట్లు పోలీసులు తెలిపారు.
అమెజాన్ నుంచి కెమికల్స్ ఆర్డర్:- డానిష్‌ను పాకిస్థాన్ హ్యాండ్లర్ సోషల్ మీడియా ద్వారా రిక్రూట్ చేసి రాడికలైజ్ చేశారని పోలీసులు వెల్లడించారు. సిగ్నల్ యాప్‌లో “ఇంటర్న్ ఇంటర్వ్యూ” లేదా ‘బిజినెస్ ఐడియా’ వంటి సాధారణ పేర్లతో ఎన్‌క్రిప్టెడ్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి ఉగ్రవాదుల నియామకం,, ఫండ్స్ సేకరణ చేశారు. అమెజాన్ నుంచి కెమికల్స్, ఆర్డర్ చేసి బాంబులు తయారు చేసేవారు. ఈ సెల్‌లో సుఫియాన్ ఖాన్, మొహమ్మద్ హుజైఫ్ యామన్, కమ్రాన్ ఖురేషీ వంటి మరో పన్నెండు మందిని అరెస్ట్ చేశారు. వీరు సీనియర్ BJP నాయకులు, మత స్థలాలపై దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన ద్వారా భారతదేశంలో ISIS నెట్‌వర్క్‌ ల ప్రమాదాన్ని,, సోషల్ మీడియా ద్వారా రాడికలైజేషన్‌ను బట్టబయలు చేసింది. పాకిస్థాన్ సాయంతో అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌ లు భారత్‌లో ఎలా పనిచేస్తున్నయనే బయట పడింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *