AP&TG

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

అమరావతి : రేపటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.గురువారం ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు, ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి.అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు,శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎస్‌, డీజీపీతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశాల సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లపై ఈ భేటీలో చర్చ జరిగింది. రేపటి ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరుగుతుంది. శాసనసభ సమావేశాల నిర్వహణపై తుది నిర్ణయం బీఏసీ సమావేశంలో తీసుకోనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *