NATIONAL

వక్ఫ్‌ (సవరణ) 2025 చట్టంపై స్టేకు నిరాకరించిన సుప్రీమ్ కోర్టు

అమరావతి: వక్ఫ్‌ (సవరణ) 2025 చట్టంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది..ఇదే సమయలోం కొన్ని నిబంధనలను తాత్కలికంగా నిలిపివేసింది. చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ ఆగస్టిన్‌ జార్జ్‌తో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాం మతాన్ని ఆచరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్‌గా చేయడానికి అవకాశం ఉంటుందన్న నిబంధన (సెక్షన్‌ 3)ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఒక వ్యక్తి ఐదేళ్ల పాటు ముస్లిం మతాన్ని ఆచరించడానికి ఎలా నిర్ణయించాలో ఆ నియమాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేంత వరకు ఈ నిబంధనను నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.అలాగే సెక్షన్‌ 3తో పాటు 9, 14, 23, 36, 107, 108 సెక్షన్లను సుప్రీంకోర్టు నిలిపివేస్తూ, కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది.

వక్ఫ్‌,, వక్ఫ్‌ వాటాదారుల హక్కులను జిల్లా కలెక్టర్‌ వంటి ప్రభుత్వ అధికారులు నిర్ణయించడానికి అనుమతించడం అధికార విభజన సిద్ధాంతానికి విరుద్ధంగా ఉందని సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయి ధర్మాసనం అభిప్రాయపడింది. వక్ఫ్‌ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య వీలైనంత వరకు మెజార్టీలో ఉండేలా చూడాలని పేర్కొంది. బోర్డులో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండొచ్చని సూచించింది.. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ముస్లిం వ్యక్తే ఉండటం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *