పండుగలను స్వదేశీ వస్తువులతోనే జరుపుకోవాలని దేశ ప్రజలున కోరిన ప్రధాని మోదీ
భారతదేశంలో తయారైన వస్తువులను మాత్రమే..
అమరావతి: కేంద్ర ప్రభుత్వం, అస్సాం సంయుక్త ప్రయత్నాల కారణంగా, నేడు అస్సాం 13 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని ఈశాన్య రాష్ట్రాల్లో రెండవ రోజు పర్యటిస్తున్నారు. ఆదివారం అస్సాంలో రూ.19,000 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించి అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ ఈ సంవత్సరం పండుగలను స్వదేశీ వస్తువులతోనే జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కంపెనీ ఏ దేశానికి చెందినదైనా, ఏ దేశ పేరు అయినా, భారతదేశంలో తయారైన వస్తువులను మాత్రమే కొనాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ఎల్లప్పుడూ భారత వ్యతిరేక శక్తులకు అండగా:- ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అస్సాం ముద్దు బిడ్డ భూపేన్ హజారికాను కాంగ్రెస్ అవమానించిందని అన్నారు. ఇది చాలా బాధాకరం అన్నారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ భారత వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తుందని, చొరబాటుదారులను రక్షించడానికి కృషి చేస్తోందని మండిపడ్డారు.దేశంలోకి ఆక్రమ చొరబాట్లను ఆపడానికి బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు.
నా తల్లిపైన చేసిన “దూషణల విషాన్ని” మింగేస్తాను:- ప్రధాని మోదీతో పాటు ఆయన తల్లి హీరాబెన్‌పై ఏఐ వీడియో రూపొందించిన కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ ఐటీ సెల్‌పై కేసు నమోదైన విషయం విదితమే.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల బిహార్‌లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో కొందరు మోదీ తల్లిని దూషిస్తూ కామెంట్స్ చేశారని విషయంను గుర్తు చేసుకుంటూ,తనతో పాటు తన తల్లిపైన చేసిన “దూషణల విషాన్ని” మింగేస్తానని,, ఎందుకంటే తాను శివ భక్తుడి అని వ్యాఖ్యానించారు.
నాకు కష్టం వస్తే ప్రజల ముందే ఆవేదనను:- ప్రజలే తనకు అధికారం ఇచ్చారని, వారే నా యజమానులని అన్నారు. 140 కోట్ల మంది దేశ ప్రజల చేతిలోనే తన రిమోట్ కంట్రోల్ ఉంటూదని, తనకు కష్టం వస్తే వారిముందే నా ఆవేదనను వ్యక్తం చేస్తానని చెప్పారు.ఇది తప్ప, నాకు వేరే రిమోట్ కంట్రోల్ లేదన్నారు.కాంగ్రెస్ పార్టీ అహంకారంతో వ్యవహరిస్తొందని,కాంగ్రెస్ కు తగిన సమాధానం చెప్పాలని కోరారు. అస్సాం సాంస్కృతిక వారసత్వం పట్ల గౌరవం, అస్సాం వేగవంతమైన అభివృద్ధి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలతో సాధ్యామన్నారు.