కేరళ అర్బన్ కాంక్లేవ్ సమావేశంలో పాల్గొన్న కమిషనర్ నందన్
నెల్లూరు: కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కేరళ అర్బన్ కాంక్లేవ్ సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ శనివారం పాల్గొన్నారు. రాష్ట్ర తొలి సమగ్ర పట్టణ విధానాన్ని రూపొందించడానికి నిర్వహించిన కేరళ అర్బన్ కాంక్లేవ్ 2025 కొచ్చి ప్రాంతంలోని గ్రాండ్ హయత్ కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజులపాటు నిర్వహించారు. “ఆకాంక్షించే నగరాలు, అభివృద్ధి చెందు సమాజాలు” అన్న థీమ్ తో నిర్వహించిన ఈ సమావేశంలో చివరి రోజు కేరళ రాష్ట్రం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఎక్సైజ్ అండ్ పార్లమెంటరీ అఫైర్స్ మంత్రి ఎం.బి రాజేష్ తో కమిషనర్ మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై చర్చించారు.